హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పై గోపీచంద్ కన్ను.. మూడోసారి ఆ డైరెక్టర్ తో..

  • IndiaGlitz, [Wednesday,July 14 2021]

యాక్షన్ హీరో గోపీచంద్ జోరు మాములుగా లేదు. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు మూడో చిత్రాన్ని కూడా ప్రకటించేశాడు. గోపీచంద్ 30వ చిత్రం క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతోంది. దర్శకుడు శ్రీవాస్ గోపీచంద్ ని మూడోసారి డైరెక్ట్ చేయబోతున్నారు.

ఇప్పటికే వీరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. దీనితో హ్యాట్రిక్ కాంబినేషన్ కి రంగం సిద్ధం అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ లో టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

గోపీచంద్, శ్రీవాస్ తొలి కలయికలో 2007లో లక్ష్యం చిత్రం విడుదలయింది. ఆ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబోలో 2014లో లౌక్యం చిత్రం తెరకెక్కింది. అది కూడా హిట్టే. దీనితో వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోపై ఆసక్తి పెరిగింది.

దర్శకుడు శ్రీవాస్ కమర్షియల్ చిత్రాలని డీల్ చేయడంలో సిద్ధహస్తుడు. శ్రీవాస్ చివరగా తెరకెక్కించిన చిత్రం సాక్ష్యం. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

ఇక గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక శ్రీవాస్ దర్శకత్వంలో చిత్రం పట్టాలెక్కనుంది.

More News

'నారప్ప' ట్రైలర్: వెంకటేష్ మాస్ విశ్వరూపం

విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వెంకీ రఫ్ లుక్ లో మాస్ పెర్ఫామెన్స్ అందించబోతున్న చిత్రం ఇది.

'SR కల్యాణమండపం' టీజర్.. పంచ్ డైలాగ్, యాటిట్యూడ్ అదుర్స్!

యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం 'SR కల్యాణమండపం'. టాక్సీవాలా ఫేమ్ హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది.

హీరోలు పడుకోమన్నారు.. నిలదొక్కుకోవాలంటే తప్పదు, ఎన్నో సినిమాలు

శృంగార తార మల్లికా శరావత్ తన బోల్డ్ రోల్స్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన నటి.

బంధువులు ఆ కారు కొన్నారని.. రేసింగ్ పై హీరోయిన్ పిచ్చి.. 

హాట్ బ్యూటీ నివేద పేతురాజ్ కు రియల్ లైఫ్ లో ఓ సరదా ఉంది. సరదా కంటే పిచ్చి అంటే బెటర్ ఏమో.

కార్తికేయ సరసన హాట్ బ్యూటీ.. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ

మీడియం బడ్జెట్ లో ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తోంది టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయ యువతకు బాగా చేరువయ్యాడు.