తేజ సినిమా నుండి తప్పుకున్న గోపీచంద్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఒకానొక దశలో సక్సెస్‌లు లేక ఖాళీగా కూర్చుంటే డైరెక్టర్ తేజ తనని జయం, నిజం వంటి సినిమాల్లో విలన్‌గా చూపించి తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చి అందరితో శభాష్ అనిపించాడు. వర్షం సినిమాలో తర్వాత గోపీచంద్ విలన్‌గా నటించడం విశేషం. ఆ తర్వాత హీరోగా మారిన గోపీచంద్, వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓ రకంగా గోపీచంద్‌కు తేజ నటుడిగా బ్రేక్ ఇచ్చాడనే చెప్పాలి. అలాంటి దర్శకుడితో ఓ సినిమా చేయడానికి గోపీచంద్ ఓకే చెప్పాడు. ఆ సినిమానే అలివేలు వెంకటరమణ. ఈ సినిమాలో గోపీచంద్ పక్కన నటించబోయే అలివేలు పాత్రలో ఎవరు నటిస్తారు? అని వెతుకులాట ప్రారంభించాడు. అయితే హీరోయిన్ ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు.
అయితే ఉన్నట్లుండి.. ఇప్పుడు తేజ సినిమా నుండి గోపీచంద్ డ్రాప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం, గోపీచంద్, తన స్నేహితులైన యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకోవడమే. మారుతి దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. నిజానికి ఈ చిత్రంలో రవితేజ హీరోగా చేయాల్సింది కానీ.. రవితేజ రెమ్యునరేషన్ కారణంగా డ్రాప్ కావడంతో అతని స్థానంలో గోపీచంద్ నటించడానికి ఓకే చెప్పాడని టాక్. ఈ సినిమా కారణంగా తేజ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక గోపీ చంద్ డ్రాప్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com