ఒక‌రోజు ముందుగా వ‌స్తున్నగోపీచంద్

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించారు. ఈ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న రెజీనా న‌టించింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సౌఖ్యం ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

గోపీచంద్, ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి కాంబినేష‌న్లో గ‌తంలో య‌జ్నం సినిమా రూపొందింది. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యాన్నిసాధించింది. మ‌ళ్లీ ఇప్పుడు గోపీచంద్, ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి క‌ల‌యిక‌లో సౌఖ్యం సినిమా అన‌గానే ప్రారంభం నుంచి మంచి క్రేజ్ ఏర్ప‌డింది.ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రాన్ని క్రిస్మెస్ కానుక‌గా సౌఖ్యం సినిమాని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..25న ఇంకా సినిమాలు రిలీజ్ ఉండ‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే ఈనెల 24న సౌఖ్యం రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది.