షూటింగ్ జరుపుకుంటున్న భవ్య క్రియేషన్స్ చిత్రం

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 'యజ్ఞం' విడుదలై, దాదాపు పదకొండేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ హీరోగా రవికుమార్ చౌదరి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా నిరవధికంగా జరుగుతోంది.

చిత్రవిశేషాలను రవికుమార్ చౌదరి చెబుతూ - ''గోపీచంద్ తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం'కి, దీనికీ సంబంధం లేదు. ఈ చిత్రకథ వినూత్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నా సినిమాల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అది మిస్ కాదు.అలాగే, యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పటివరకూ గోపీచంద్ కెరీర్లో భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. కథ డిమాండ్ మేరకు చాలా పాత్రలుంటాయి. అయితే, అన్ని పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఒక సూపర్ హిట్ మూవీకి కావల్సిన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

'యజ్ఞం'తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, రవికుమార్ చౌదరి కాంబినేషన్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. శరవేగంగా షూటింగ్ చేస్తున్నాం'' అని ఆనంద్ ప్రసాద్ చెప్పారు.

గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, నాజర్, ముఖేష్ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: కోన వెంకట్, రచన: ఘటికాచలం, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.

More News

సెప్టెంబర్ 12న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో విడుదల

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

కత్తిరించేశారు

సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు.

హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను

త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న 'కేటుగాడు'

‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత

సుధీర్ మంచి రోజులు

సుధీర్ బాబు, వామికా గబ్బీ జంటగా నటిస్తున్న సినిమా `భలే మంచి రోజు`.