రేపు గోపీచంద్ ఆక్సిజన్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆక్సిజన్. ఈ చిత్రాన్ని శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తుండడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆక్సిజన్ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో మూడవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఆక్సిజన్ మూవీ ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.
గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆక్సిజన్ సక్సెస్ పై టీమ్ నమ్మకంతో ఉన్నారు. గోపీచంద్, జగపతిబాబు, కిక్ శ్యామ్, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్: సిల్వ, ఆర్ట్: మిలన్, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments