అలాగే వస్తున్న గోపీచంద్, సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
'లౌక్యం' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత గోపీచంద్ నటించిన 'జిల్', 'సౌఖ్యం', 'గౌతమ్‌నంద', 'ఆక్సిజన్' చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో.. గోపీచంద్ నటించిన 25 చిత్రం 'పంతం' జూలై 5న విడుదల కానుంది.
ఆ సినిమా విడుదలైన తరువాతి రోజు అంటే జూలై 6న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'తేజ్ ఐ లవ్ యు' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'సుప్రీమ్' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తేజ్ నటించిన 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటిలిజెంట్' సినిమాలు ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి. గోపీచంద్ లాగే తేజుకి కూడా వరుస పరాజయాల తర్వాత వస్తున్న సినిమా ఇది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీరిద్దరూ గత ఏడాది కూడా ఒక్క రోజు గ్యాప్‌లో తమ సినిమాలతో పోటీ పడ్డారు. గత ఏడాది నవంబర్ 30న 'ఆక్సిజన్' తో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఒక్క రోజు వ్యవధిలో అంటే డిసెంబర్ 1న తేజు నటించిన 'జవాన్' చిత్రం విడుదలైంది.
ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. మరి ఈ సారైనా వీరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments