తేజ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పిన గోపిచంద్ , రవికుమార్ చౌదరి
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధర్మతేజ్, రెజినా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా రూపోందిన చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రం పై ఇప్పటికే పాజిటివ్ టాక్ వుండటం విశేషం. ఈచిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా నమ్మకంతో వున్నారు.
సాయిధర్మతేజ్ మెదటి చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి, హీరో గోపిచంద్ కాంబినేషన్ లో చేస్తున్నచిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా సాయిధర్మతేజ్ షూటింగ్ లోకేషన్ కి వెళ్ళారు. వెంటనే హీరో గోపిచంద్, దర్శకుడు రవికుమార్ చౌదరి సాయి ధర్మతేజ్ ని పలకరించి తను నంటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' పెద్ద విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్ర యూనిట్ మెత్తానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com