గోపీచంద్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా టైటిల్ 'చాణక్య'
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి `చాణక్య` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఈరోజు దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు తిరు.. గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీనా ఖాన్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments