మళ్లీ ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్.
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సౌఖ్యం సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సౌఖ్యం సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...గోపీచంద్ గతంలో ఆంథ్రడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పరుచూరి మురళీ తెరకెక్కించారు.
గోపీచంద్ కోసం పరుచూరి మురళి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసారట. కథ విని గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గోపీచంద్, పరుచూరి మురళి కాంబినేషన్లో రూపొందే తాజా చిత్రాన్ని భగవాన్ - పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్నారు. బాలయ్యతో పరుచూరి మురళి అధినాయకుడు అనే సినిమాను తెరకెక్కించారు. అయినా..కెరీర్ లో బ్రేక్ రాలేదు. మరి గోపీచంద్ తో తీసే మూవీతోనైనా డైరెక్టర్ పరుచూరి మురళికి బ్రేక్ వస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments