'పంతం' లాంటి సోషల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయడం ఆనందంగా ఉంది - గోపీచంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. ఫర్ ఎ కాస్.. ఉప శీర్షిక. ఈ సినిమా జూలై 5న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
హీరో గోపీచంద్ మాట్లాడుతూ - "మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సురేందర్ రెడ్డిగారికి థాంక్స్. నేను ఏదైతే కథను నమ్మి సినిమా చేశానో.. అది రేపు నిజం కానుంది. సినిమా చేయడానికి ముందు `కథ బాగా చెప్పావ్.. అలాగే తీస్తావా` అని చక్రవర్తిని కథ చెప్పిన రోజున అడిగాను. తను అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు. అన్నట్లుగానే సినిమాను అద్భుతంగా చేశాడు.
ప్రసాద్ మూరెళ్ళ, రమేశ్రెడ్డిగారి నుండి ఈ కథ నాకు వచ్చింది. మా నాన్నగారు చేసిన సినిమాల తరహాలో సినిమా చేయాలనకుంటున్న తరుణంలో నా 25వ సినిమాకు అలాంటి కథ కుదరడం ఆనందంగా ఉంది. నా 25వ సినిమాను మంచి సోషల్ కాజ్ ఉన్న కమర్షియల్ మూవీగా చేశాను. పాటలు, టీజర్‌కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. ట్రైలర్‌తో పాటు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్ముతున్నాను"అన్నారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ - "పంతం.. ఫర్ ఎ కాజ్.. అనే యాప్ట్ టైటిల్‌గా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైలర్‌లోని డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతుందనని చెప్పకనే చెబుతున్నాయి. సామాజిక సమస్యను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించారు.
అలా చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలన్నీ పెద్ద సక్సెస్‌లయ్యాయి. రాధామోహన్‌గారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రసాద్ మూరెళ్లగారి అద్భుతమైన విజువల్స్ సినిమా ఎంత క్వాలిటీగా ఉండబోతుందో చెబుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు" అని తెలిపారు.
కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - "మా బ్యానర్లో ఏడో సినిమా. గోపీచంద్‌గారి ప్రెస్టీజియస్ 25వ సినిమా. నాకు అవకాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి థాంక్స్. చక్రవర్తిగారు కొత్త డైరెక్టర్ కదా.. ఎలా పిక్చరైజ్ చేస్తారోనని చిన్న డౌట్ ఉండేది. కానీ ఆయనతో మూడు నాలుగు డిస్కషన్స్ చేసిన తర్వాత చాలా నమ్మకం కలిగింది.
సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. ప్రసాద్‌గారు మంచి విజువల్స్ చేశారు. మెహరీన్ ఐదో సినిమా ఇది. తను నటించిన సినిమాలన్నీ విజయవంతమైయాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. జూలై 5న సినిమాను విడుదల చేస్తున్నాం" అన్నారు.
డైరెక్టర్ కె.చక్రవర్తి మాట్లాడుతూ - "టీజర్, పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం" అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ - "సినిమాపై అందరం చాలా పాజిటివ్‌గా ఉన్నాం. జూలై 5న విడుదల కాబోయే సినిమా పెద్ద హిట్ అవుతుదనే కాన్ఫిడెన్స్ ఉంది" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout