మే 19న విడుదలవుతున్న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్ తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం "ఆరడుగుల బుల్లెట్" విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్- బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మే 19న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్, మాస్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న "ఆరడుగుల బుల్లెట్"ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com