నెలకో సినిమాతో గోపీసుందర్
Send us your feedback to audioarticles@vaarta.com
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాసిక్ ఫిల్మ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సంగీత దర్శకుడు గోపి సుందర్. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందించి.. నెలకో సినిమాతో ప్రేక్షకులని ఉర్రూతలూగించడానికి సిద్ధపడుతున్నారు గోపి.
ఆ వివరాల్లోకి వెళితే.. లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి డైరెక్షన్‌లో రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ‘రాజుగాడు’ సినిమాకి సంగీతం అందించారు గోపిసుందర్. ఈ చిత్రం మే 11న థియేటర్లలో సందడి చేయనుంది. అంతేగాక.. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రానికి కూడా గోపి సుందర్ స్వరాలను అందించారు. ఈ మూవీ జూన్ 14న విడుదల కానుంది.
అదేవిధంగా.. గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’కి కూడా సంగీతం అందించారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం జూలై 5న రిలీజ్‌కు సిద్ధపడుతోంది. ఇలా నెలకో సినిమాతో తన సంగీతంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న గోపిసుందర్ ఏ మేర వారిని ఆకట్టుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com