గూగుల్ సర్వర్లు గంటపాటు డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
గూగుల్ సర్వర్లు ఇవాళ షాకింగ్‌గా గంట పాటు పని చేయకుండా పోయాయి. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా గూగుల్‌కు చెందిన ప్రధాన సర్వీసుులు జీమెయిల్, యూట్యూబ్, ఫోటోస్, హ్యాంగ్అవుట్స్, గూగుల్ షీట్స్, కాంటాక్స్ సహా గూగుల్ ప్రోడక్ట్ సేవలన్నీ నిలిచిపోయాయి. యూట్యూబ్ స్క్రీన్‌పై ఒక్కసారిగా కోతిబొమ్మ కనిపించింది. పోనీ మెయిల్ చేద్దామంటే.. టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్.. ఇలా ఒక్క దేశంలో కాదు.. ఎన్నో దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. సుమారు గంటపాటు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొన్ని దేశాల్లో అయితే గంట తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.
ఇలా గూగుల్ సేవలు నిలిచిపోవడం కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 150 కోట్ల మంది ఇబ్బంది పడుంటారని టెక్ వర్గాల అంచనా. అయితే జీమెయిల్, యూట్యూబ్ సర్వీసులు ఇటీవలి కాలంలో కామన్‌గా డౌన్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజులు గూగుల్ సర్వీసులన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోయాయి. దీంతో ట్విట్టర్‌లో #gmaildown, #youtubedown అంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు పెట్టారు. అయితే ఈ ట్వీట్ల పరంపర గూగుల్ సర్వీసులు పునరుద్ధరించబడిన అనంతరం కూడా కొనసాగాయి. దీంతో మీమ్స్.. సెటైర్స్.. ఫన్నీ ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను నెటిజన్లు హోరెత్తించారు.
గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో ఇలాంటి పొరపాటు తలెత్తడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్లు డౌన్ అవడమనేది సహజమే కానీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా డౌన్ కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే సర్వర్లు ఒక్కసారిగా అలా ఎందుకు డౌన్ అయ్యాయో గూగుల్ సంస్థ వెల్లడించాల్సి ఉంది. అయితే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో మాత్రం కొన్ని సర్వీసులు పని చేసినట్టు వినియోగదారులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout