అదిరిపోయే ఫీచర్స్ తో 'జియో ఫోన్ నెక్స్ట్' స్మార్ట్ ఫోన్.. గూగుల్, జియో సంయుక్తంగా

  • IndiaGlitz, [Thursday,June 24 2021]

రిలయన్స్ 'జియో'తో మొబైల్ నెట్వర్కింగ్ లో సరికొత్త విప్లవం చోటు చేసుకుంది. జియో తన పరిథిని విస్తరించుకునేలా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇండియాలో ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ కంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ వాడకమే ఎక్కువ. అలాంటి వినియోగదారులని టార్గెట్ చేస్తూ సరికొత్త విప్లవానికి జియో, గూగుల్ సంస్థలు చేతులు కలిపాయి.

ఇదీ చదవండి: ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కైన జ్యోతిష్కుడు.. రూ.17 కోట్ల నకిలీ దందా!

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా 'జియో ఫోన్ నెక్స్ట్' స్మార్ట్ ఫోన్ ని ప్రకటించారు. తక్కువ ధరకే సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నాణ్యమైన 5జి స్మార్ట్ ఫోన్ ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికి 300 మిలియన్ల మంది ఇండియాలో 2జి సర్వీసులనే ఉపయోగిస్తున్నారు. అందుకు కారణం బేసిక్ 4జి స్మార్ట్ ఫోన్ కూడా ఎక్కువ ఖరీదుతో ఉంటోంది.

ఈ విషయం గురించి నేను, సుందర్ పిచాయ్ గత ఏడాది చర్చించుకున్నాం. అద్భుతమైన ఫీచర్లు, 5జి, అతి తక్కువ ధరతో ఉండే జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్నాం. ఈ ఫోన్ ని మార్కెట్ లోకి వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

జియో ఫోన్ నెక్స్ట్ పై అప్పుడే ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి తెస్తున్న క్సియోమి, శాంసంగ్, రియల్ మి లాంటి సంస్థలకు జియో ఫోన్ నెక్స్ట్ గట్టి పోటీగా నిలుస్తుంది అని అంచనాలు మొదలయ్యాయి.

ఈ స్మార్ట్ ఫోన్ లో వాయిస్ అసిస్టెంట్, ఆటోమాటిక్ రీడ్ అలౌడ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్సలేషన్ లాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ట్విట్టర్ ఈ స్మార్ట్ ఫోన్ పై ప్రకటన చేశాడు.