అనుష్క విషయంలో తప్పులో కాలేసిన గూగుల్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ విషయంలో గూగుల్ తప్పులో కాలేసింది. అనుష్క విషయంలో గూగుల్ చేసిన తప్పేంటా? అనుకుంటున్నారా? చిన్న చితకా తప్పు కాదు.. చాలా పెద్ద తప్పే చేసింది. అసలు విషయంలోకి వెళితే.. అఫ్ఘనిస్థాన్ క్రికెటర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రషీద్ ఖాన్ భార్య ఎవరంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే వెంటనే గూగుల్ అలా చూపించడానికి గల కారణాలను కూడా అన్వేషించారు.
రషీద్ ఖాన్ భార్యగా అనుష్క పేరు చూపిస్తుండటంపై పలు వివరణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓసారి రషీద్‌ఖాన్ తన ఇంటర్వ్యూలో అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు? అని అడిగారు. దీనికి సమాధానంగా రషీద్‌ఖాన్.. అనుష్క శర్మ, ప్రీతిజింతా పేర్లను చెప్పారు. అప్పుడు రషీద్ ఖాన్.. అనుష్క శర్మకు చాలా పెద్ద అభిమాని అంటూ పలు వెబ్‌సైట్స్ వార్తలను రాశాయి. ఆ కారణంగానే ఇప్పుడు రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు వస్తుంది. ప్రస్తుతం రషీద్ తన టీంకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మరి గూగుల్ ఈ తప్పును వెంటనే గుర్తించి సరిదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com