భారత్‌కు రూ.135 కోట్ల విరాళాన్ని ప్రకటించిన గూగుల్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ విస్తరణ వేగం అధికంగా ఉండటంతో రోజుకు లక్షల్లో జనాభా కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరతతో పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొరత వంటి పలు ఇబ్బందులను దేశం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మన దేవానికి సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనాతో పాటు పాకిస్థాన్ వంటి దేశాలున్నాయి. తమ సామర్థ్యాన్ని బట్టి ఆయా దేశాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. కోవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు సాయమందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే భారత్‌కు రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గివ్ ఇండియాకు, యూనిసెఫ్‌కు ఈ ఫండ్ అందించనున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను భారత్‌కు అందించాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. అలాగే పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా పంపించాలని నిర్ణయించింది. ఇక, భారత్‌లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే 600కు పైగా ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు పంపింది. ఇంగ్లండ్‌లోని బకింగమ్‌షైర్ మిల్టన్ కీన్స్ నుంచి భారత్‌కు తరలించారు. కోవిడ్‌పై పోరులో భారత్‌కు అండగా ఉంటామని ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments