'గూఢచారి' కంటిన్యూ అవుతాడు!

  • IndiaGlitz, [Saturday,November 10 2018]

అంత త‌క్కువ బ‌డ్జెట్లో ఆ క్వాలిటీ ఎలా సాధ్య‌మైంది..? 'గూఢ‌చారి' సినిమాను చూసిన వారంద‌రిదీ ఒకే ప్ర‌శ్న‌. అయినా స‌రైనా ప్ర‌ణాళిక‌తో, ప‌క్కాగా చేసి చూపించారు అడివి శేష్‌. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా 'గూఢ‌చారి'. ఈ సినిమావిమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డంతో పాటు, చాలా మంది రెవెన్యూను కూడా తెచ్చుకుంది. ఈసినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని తొలి భాగం చివ‌ర‌లో హింట్ ఇచ్చారు.

ఆ సినిమాకు క‌థ‌ను అందించిన శేష్ ఇప్పుడు సీక్వెల్ కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. అందులో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌, సుప్రియ పాత్ర‌లు ఇందులోనూ ఉంటాయ‌ని వినికిడి. శోభిత ధూళిపాళ‌కు సంబంధించి ఒక‌టీ, రెండు స‌న్నివేశాలు కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ట‌. ఆమె జ్ఞాప‌కాల‌ను హీరో త‌ల‌చుకునే స‌న్నివేశాల‌ని తెలిసింది. ఈ సినిమాను శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం లేద‌ట‌. తొలి భాగానికి స్క్రిప్ట్ సైడ్ ప‌నిచేసిన రాహుల్ పాకాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్టోరీ డిస్క‌ష‌న్స్ లో రాహుల్‌, శ‌శికిర‌ణ్‌, అడివి శేష్ ముగ్గురూ ఉన్నార‌ట‌. సో త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన వివ‌రాలు తెలియ‌నున్నాయి.

More News

'బాహుబ‌లి' ముందు...అక్క‌డ మొద‌ల‌వుతుంది!

బాహుబ‌లి సినిమాను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌ల్పిత గాథ అయిన‌ప్ప‌టికీ అప్పుడెప్పుడో నిజంగానే జ‌రిగిందా అన్నంత ఘ‌నంగా తెర‌కెక్కించారు బాహుబ‌లి.

బ్రిడ్జి మీద ఫ‌న్నా? ఫ‌్ర‌స్ట్రేష‌నా?

అనిల్ రావిపూడి తీసే సినిమాల‌ను చూస్తే ఈ జ‌న‌రేష‌న్‌తో పాటు నిన్న‌టి జ‌న‌రేష‌న్ జ్ఞాప‌కాల‌ను కూడా గుర్తుచేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారేమోన‌ని అనిపిస్తుంది.

వారెవా ఆది..!

ఆది సాయికుమార్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌స్తోంది. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సినిమా ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌. ఇందులో ఆయ‌న ఎన్ ఎస్ జి క‌మాండోగా న‌టిస్తున్నారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచే 'కేజీఎఫ్'.. ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)'.

బిగ్ బాస్ ఫేం భాను శ్రీ  ప్ర‌ధాన పాత్ర‌లో ఈ అమ్మాయి మూవీ ప్రారంభం

బిగ్ బాస్ ,ఏడు చేప‌ల క‌థ  ఫేం భాను శ్రీ ప్ర‌ధాన‌పాత్ర‌లో  దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ  తెర‌కెక్కిస్తున్న " ఈ అమ్మాయి "