'గూఢ‌చారి 2' సిద్ధ‌మ‌వుతున్నాడు

  • IndiaGlitz, [Monday,December 17 2018]

అడివిశేష్ హీరోగా రూపొందిన చిత్రం 'గూఢ‌చారి'. రా ఎజెన్సీ త్రినేత్ర ఎజెంట్ గోపి మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు. 'గూఢ‌చారి 2' స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వుతోంది. 2019లో ద్వితీయార్థంలో ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా 2020లో విడుద‌ల‌వుతుంది.

అయితే గూఢ‌చారిని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌డం లేదు. రాహుల్ పాకాల సినిమాను తెర‌కెక్కించబోతున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌పిక్చ‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై అనీల్ సుంక‌ర‌, అభిషేక్ నామ, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌ నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.