‘జీ 5’ ప్రారంభించిన ఉచిత కరోనా టీకా కార్యక్రమం ‘సంకల్పం’కు అద్భుత స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
‘కల్యాణ వైభోగం’ స్టార్ మేఘనా లోకేష్, ‘రాధమ్మ కూతురు’ దీప్తీ మన్నేతో ‘ఎనీ టైమ్ మనోరంజనం’ (ఏటీయమ్) క్యాంపెయిన్ ప్రారంభించిన ‘జీ5’. ఏటీయమ్ టీజర్ విడుదల చేసిన సత్యదేవ్
హైదరాబాద్, జూలై 30, 2021: కోట్లాదిమంది భారతీయులకు వివిధ భాషల్లో వినోదాన్ని అందిస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక ‘జీ5’. ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్–టు–డిజిటల్ రిలీజ్‌లతో వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తాజాగా హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ మనోరంజనం’ (ఏటీయమ్) క్యాంపెయిన్‌ను ‘జీ5’ ప్రారంభించింది. ‘జీ5’లో స్ట్రీమింగ్ అయిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ (గాడ్), ఒరిజినల్ మూవీ ‘47 డేస్’లో నటించిన ప్రముఖ యువ హీరో సత్యదేవ్ ‘ఏటీయమ్’ టీజర్ విడుదల చేశారు. ఆయనతో పాటు ‘కల్యాణ వైభోగం’ సీరియల్ స్టార్ మేఘనా లోకేష్, ‘రాధమ్మ కూతురు’ సీరియల్ స్టార్ దీప్తీ మన్నే ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తమకు నచ్చిన సమయంలో, నచ్చిన చోటు నుంచి... తమకు నచ్చిన సీరియళ్లు, సినిమాలు, వార్తలు ఉచితంగా చూసే అవకాశాన్ని వీక్షకులకు ‘ఏటీయమ్’ అందిస్తోంది. తెలుగు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ‘జీ5’ ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలందరూ ‘జీ5’ ప్రారంభించిన ఉచిత టీకా డ్రైవ్ ‘సంకల్పం’ గురించి గొప్పగా మాట్లాడారు.
ప్రజలకు వినోదం అందించడం మాత్రమే కాదు... ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ‘జీ5’ కోరుకుంటోంది. ఎప్పుడూ సమాజం శ్రేయస్సు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. కరోనా కష్టకాలంలో హైదరాబాద్‌లోని ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించాలని ‘సంకల్పం’ పేరుతో ఉచికా టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పది రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. శుక్రవారం, జూలై 30న హైదరాబాద్‌లో ‘జీ5 సంకల్పం’కు అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 8 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘నేను ఓటీటీ ప్రపంచంలోకి ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ (గాడ్)తో అడుగుపెట్టాను. దానికి మంచి స్పందన లభించింది. జీ5లో ట్రెండింగ్ షోస్‌లో ఒకటిగా నిలిచింది. నా సినిమా ‘47 డేస్’ కూడా జీ5లో విడుదలైంది. వాళ్లు ప్రారంభించిన ‘జీ5 సంకల్పం’ గురించి విన్నాను. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమానికి నాంది పలకడం మంచి పరిణామం. మునుపటిలా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే రోజుల కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. కొవిడ్ భయాందోళనలు పోవాలంటే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కొంతమంది వ్యాక్సిన్లు వేయించుకోవాలనుకున్నా... వ్యాక్సిన్లు దొరకలేదు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని జీ5 సంకల్పించడం నిజంగా గొప్ప నిర్ణయం. ఇక్కడున్న వారందరూ చెప్పినట్టు నా సినిమా ‘తిమ్మరుసు’ ఈ రోజు విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వ్యాక్సినేషన్ పూర్తయితే ఎక్కువ థియేటర్లు ఓపెన్ అవుతాయని, ఎక్కువమంది థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా. ప్రపంచంలో ప్రతిదీ లింక్ అయ్యి ఉంది. కరోనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. వ్యాక్సిన్ ద్వారా దాన్ని ఎదుర్కొందాం. ‘ఏటీయమ్’ – పేరు ఫ్యాన్సీగా ఉంది. జీ5లో చాలా కంటెంట్ ఉంది. జీ5 డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు’’ అని అన్నారు.
జీ5 ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘‘వీక్షకులు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకొని, వివిధ భాషలు–జానర్లలో అత్యుత్తమ వినోదం అందించడంతో పాటు కరోనా కాలంలో వాళ్ల బాగోగులు చూసుకోవడమే మా లక్ష్యం. ‘జీ5 సంకల్పం’ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకటించినప్పుడు అద్భుత స్పందన లభించింది. ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించాం. బాధ్యతాయుతమైన సంస్థగా వీలైనంతమందికి ఉచితంగా టీకాలు అందించాలని అనుకుంటున్నాం. తెలుగులో జీ5 పాపులర్ బ్రాండ్. ‘ఎనీ టైమ్ మనోరంజనం’ (ఏటీయమ్) క్యాంపెయిన్‌తో కొత్త యూజర్లకు చేరువ అవుతామని ఆశిస్తున్నాం. టీవీ చూడటానికి అలవాటు పడిన ప్రజలు ‘జీ5’ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన సమయంలో నచ్చిన టీవీ సీరియల్, షో, సినిమాలు చూడొచ్చు’’ అని అన్నారు.
మేఘా లోకేష్ మాట్లాడుతూ ‘‘జీ5 సంకల్పం’లో నేనూ ఓ భాగం కావడం గర్వంగా ఉంది. ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ ఇది. ‘ఎనీ టైమ్ మనోరంజనం’ (ఏటీయమ్) క్యాంపెయిన్ ద్వారా నా సీరియల్ ‘కల్యాణ వైభోగం’తో వీక్షకులకు అందుబాటులో ఉండటం ముఖ్యమని నా భావన. జీ5 ద్వారా ప్రజలు ఎక్కడున్నా, ఎప్పుడైనా... తమకు నచ్చిన సమయంలో నచ్చిన షో చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.
దీప్తీ మన్నే మాట్లాడుతూ ‘‘వ్యాక్సిన్లు దొరక్క ఎంతమంది కష్టపడుతున్నారో నేను స్వయంగా చూశా. ‘జీ5 సంకల్పం’ పేరుతో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. దీనికంటే ముందు ‘జీ5’ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టింది. అవసరంలో ఉన్నవాళ్లకు దుస్తులు, నిత్యావసరాలు అందించింది. ఇప్పుడు ‘జీ5’ విదేశాల్లోనూ వీక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమైంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ‘ఎనీ టైమ్ మనోరంజనం’ (ఏటీయమ్) ద్వారా ప్రజలు తమ అభిమాన సీరియల్స్, షోస్, సినిమాలు ఎక్కడున్నా చూడవచ్చు. నేను ఎప్పుడూ జీలో షోస్ చూస్తాను. ప్రజలు అందర్నీ ‘జీ5’ యాప్ డౌన్లోడ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ ఆవశ్యకతను, అవసరాన్ని ప్రజలకు చెప్పడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిండచమే ‘జీ5 సంకల్పం’ ముఖ్య ఉద్దేశం. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్న హైదరాబాద్ ప్రజలు జూలై 20 నుంచి 26 వరకూ https://atm.zee5.com వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. జూలై 30 నుంచి ఆగస్టు 8 వరకూ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. కోవీషీల్డ్ (తొలి డోసు), కోవీషీల్డ్ లేదా కోవాగ్జిన్ (రెండో డోసు – తొలి డోసు ఏదీ తీసుకుంటే అది) ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
జీ5 ప్రారంభం నుంచి తెలుగుతో సహా వివిధ భాషల్లో ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోస్, వెబ్ సిరీస్‌లు విడుదల చేస్తూ వస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com