close
Choose your channels

'డై హార్డ్ ఫ్యాన్' నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన..

Thursday, March 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. ఒక సెలెబ్రిటీకి, అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. డై హార్డ్ ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. తాజాగా శివ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇంటెన్స్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో షకలక శంకర్ బేబమ్మగా, రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ గా కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కి కూడా విశేష స్పందన రావడంతో చిత్ర బృందం వారి సంతోషాన్ని తెలియజేశారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు మధు పొన్నాస్ చక్కటి సంగీతం అందించారు.ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: శివ ఆలపాటి, ప్రియాంక శర్మ, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment