వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ - నాగు గవర 'నాతిచరామి' ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. త్వరలో ఓటీటీలో సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా నాగు గవర మాట్లాడుతూ "హైదరాబాద్‌లో 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, కల్పిత పాత్రలతో రూపొందించిన చిత్రమిది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు సినిమాలో చాలా బావుంటాయి. అప్పట్లో చాలా మంది అమెరికా వెళ్లేవారు. వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా రూపొందించాం. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి... ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ 'నాతిచరామి'. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు ఉన్నాయి. 'నాతిచరామి' అనేది పెళ్లిలో భర్త చేసే ప్రమాణం. దానికి ఓ భర్త ఎంత కట్టుబడి ఉన్నాడనేది ఈ సినిమా కథ. ట్రైలర్‌కు లభిస్తోన్న ఆదరణ సంతోషాన్నిచ్చింది" అని చెప్పారు.
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి, కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: వినోద్ అద్వయ, లైన్ ప్రొడ్యూసర్: కె. మల్లిక్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్, ప్రొడ్యూసర్: జై వైష్ణవి .కె, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నాగు గవర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com