‘యాక్షన్' చిత్రంలోని ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా... పాటకు గుడ్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ’యాక్షన్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా..అన్ని మరుస్తున్నా.. నిన్ను తలుస్తున్నా..’ అంటూ సాగే పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా హిప్హాప్ తమిళ అద్భుతంగా స్వరపరిచారు. ఎం.ఎం.మానస ఈ పాటను గానం చేశారు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన ‘యాక్షన్' ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాల్ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments