'హలో'.. అనూప్ మెప్పించాడు
Send us your feedback to audioarticles@vaarta.com
జై చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనూప్ రూబెన్స్.. హలో చిత్రంతో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు. ఇష్క్, మనం చిత్రాల తరువాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అనూప్ చేస్తున్న సినిమా ఇది. అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
కాగా, ఆదివారం వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పాటలు విన్నవారంతా.. అనూప్ రూబెన్స్ కెరీర్లో మనం తరువాత గుర్తుండిపోయే ఆల్బమ్ గా హలో నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. హలో టైటిల్ సాంగ్, అనగనగా ఒక ఊరు (రెండు వెర్షన్లు), తలచి తలచి, ఏవేవో, మెరిసే మెరిసే.. ఇలా మొత్తం ఆరు పాటలున్న ఈ ఆల్బమ్ వినగానే శ్రోతలను అలరించేలా ఉంది. ప్రతి పాటలోనూ సాహిత్యం బాగా కుదిరింది. అలాగే అఖిల్ కూడా ఇందులో ఏవేవో అంటూ ఓ పాట పాడారు.
మొత్తానికి మనం తరువాత అనూప్‌కి మరో సూపర్ ఆల్బమ్ హలో రూపంలో కుదిరిందనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout