'A' (AD ‌INFINITUM) టీజర్ కు విశేష స్పందన!

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం “A”. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం సినిమా ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ను 5 లక్షల మంది వీక్షించారు ఇంకా ప్రేక్షకులు టీజర్ ను చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న సినిమాకు ఇంత భారీగా ఆదరణ రావడం విశేషం. డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని దానికి A (AD ‌INFINITUM) టీజర్ బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోకచ్చు. యుగంధర్ ముని ఎంచుకున్న డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది. త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. A (AD ‌INFINITUM) చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల, చిత్రం లోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ వ్రాయగా దీపు మరియూ పావని ఆలపించారు. తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలను పోషించడం విశేషం.

More News

న‌టుడిగా నాలో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మే ‘భాన‌మ‌తి రామ‌కృష్ణ‌’ - న‌వీన్ చంద్ర‌

‘అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’.

వారెవరో నాకు తెలియదు.. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యొద్దు: పూర్ణ

తనను, తన కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ షమ్నా ఖాసిం(పూర్ణ).. సినీ నటుడు ధర్మజన్ బోల్గట్టితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

చిరు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

మాయదారి క‌రోనా అని సినీ జ‌నాలు క‌రోనా గురించి తెగ తిట్టుకుంటున్నారు. కోవిడ్ 19 ప్ర‌భావంతో బాగా ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది.

‘గరీబ్ కల్యాణ్ యోజన’ను దీపావళి వరకూ పొడిగిస్తున్నాం: మోదీ

కరోనా విషయంలో మరింత అప్రమత్తత వహించాల్సిన సమయంలో మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.