సుమంత్ సినిమాకి మంచి ప్రీ-రిలీజ్ మార్కెట్
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా కాలం నుంచి హిట్ కోసం పరితపిస్తున్నకథానాయకుడు సుమంత్. ఈ మధ్య కాలంలో మంచి డీసెంట్ ఫిలిమ్స్ చేసినా.. అవన్నీ సుమంత్ కి హిట్ ని అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం సుమంత్ కి ఆనందాన్నిచ్చే విషయం ఒకటి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.
అదేమిటంటే.. సుమంత్ అప్ కమింగ్ మూవీ మళ్ళీ రావా`కి మంచి ప్రీ-రిలీజ్ మార్కెట్ జరిగిందని సమాచారం. ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నట్టు అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ మూవీకి బిజినెస్ పరంగా పాజిటివ్ టాక్ రావడంతో.. అటు సుమంత్, ఇటు నిర్మాతలు కూడా ఆనందంగా ఉన్నట్టు సమాచారమ్. ఈ పాజిటివ్ టాక్ ఇలాగే కొనసాగితే.. ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి డోకా ఉండదు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ కి జోడీగా ఆకాంక్ష సింగ్ నటించింది. ఆకాంక్షకి తెలుగులో ఇదే మొదటి సినిమా. క్రిస్మస్ సందర్భంగా వచ్చే నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments