కరోనా కష్టకాలంలో శుభవార్త చెప్పిన వాట్సాప్
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. అసలు కరోనాకు.. వాట్సాప్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా..? ఎలాంటి సంబంధం లేదు కానీ.. ఈ టైమ్‌లో ఏం జరిగినా.. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా.. అన్నీ కరోనా కాలంలోనే అంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పలు రంగాలు కూడా ప్రజలను ఉద్ధేశించి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయితే లాక్‌డౌన్‌తో ప్రజలు ఎక్కువ మందితో మాట్లాడుకునేందుకు వీలు కల్పించింది వాట్సాప్. ఇప్పటి వరకూ సాధారణ లేదా వీడియో కాల్ మాట్లాడేందుకు నలుగురికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే తాజాగా మరో నలుగుర్ని పెంచి.. మొత్తం ఒకేసారి 8 మంది మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించింది.
లాక్‌డౌన్ కారణంగా ఆడియో, వీడియో, గ్రూప్ కాలింగ్‌కు ఎక్కువ ఆదరణ పెరిగిన విషయం విదితమే. ఇందులో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. కాగా.. పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోందని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే శుభవార్త చెప్పినట్లే చెప్పి యాజమాన్యం.. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకుగాను కస్టమర్లు బీటా వెర్షన్ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ స్పష్టం చేసింది. సో ఏదైతేనేం వాట్సాప్ శుభావార్తే చెప్పిందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout