నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...
Send us your feedback to audioarticles@vaarta.com
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా ఒక్క పోస్టు కూడా తీయని తెలంగాణ ప్రభుత్వం సడెన్‌గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఉపాధ్యాయ, పోలీసు సహా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే హడావుడిగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఖాళీలున్నాయనే అంశంపై ఇప్పటికే నిరుద్యోగుల్లో చర్చ జరుగుతోంది. వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీ చేయాలి. పోలీసు డిపార్టుమెంటులోనే అత్యధిక పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీని తరువాత ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సైతం వెంటనే సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందనేది లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
కాగా.. ప్రభుత్వ శాఖల్లో మొత్తంగా 80 వేలకు పైగానే ఖాళీలున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా అయితే 50 వేలే కానీ.. ఆ సంఖ్య 80 వేలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 2017 డిసెంబరు నాటికి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 37,981 పోస్టులు, ఆయా సంస్థల్లో 34,663 పోస్టులు మొత్తం 72,644 పోస్టులు కొత్తగా సృష్టించినట్లు తెలిపింది. ఈ లెక్కన చూస్తే.. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు 4,41,995 ఉంటే పని చేస్తున్న ఉద్యోగులు 3,33,863 మంది ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో 1,08,132 ఖాళీలు ఉండగా, భర్తీ కోసం 63,153 పోస్టులను అనుమతించారు. కాగా.. 27,874 పోస్టులు ఇప్పటికే భర్తీ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout