ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ వరాలజల్లు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. బుధవారం నాడు ఉద్యోగలుపై కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు కూడా జారీచేయడం జరిగింది. కాగా.. ఈ ఉత్తర్వులు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తమ డిమాండ్స్ నెరవేర్చాలని ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజులపాటు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన కేసీఆర్.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేశారు. కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని.. అలాగే మహిళ ఉద్యోగులు కోరిన విధంగా ప్రసూతి సెలవులు మంజూరు చేసిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout