ఎస్‌బీఐ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్!
Send us your feedback to audioarticles@vaarta.com
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని పనికొచ్చే పనులకంటే.. చిల్లర పనులకు పాల్పడుతూ మోసాలకు తెగ పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాకింగ్, ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా, డిజిటల్ పేమెంట్స్ విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయ్. అయితే ఇలాంటి మోసాలను అరికట్టడానికి భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వినూత్న ప్రచారం చేస్తోంది.
ఎస్‌బీఐ ఓ మంచి ప్రయోగం!
ఇక నుంచి ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని ఎంటర్ చేయాల్సి ఉంది. కాగా.. రూ. 10 వేలు, అంతకు పైబడి విత్ డ్రా చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే నగదు విత్ డ్రా అవుతుంది లేకుంటే ఆ ట్రాన్సాక్షన్ రద్దు కాబడుతుంది. అయితే ఇది ఎస్‌బీఐ ఏటీఎం కార్డులున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌బీఐ కార్డులున్న వారు వేరే ఏటీఎంలలో విత్ డ్రా చేసినా.. వేరే బ్యాంకు ఖాతాదారులు ఎస్‌బీఐలో విత్ డ్రా చేసిన ఇది వర్తించదు. 2020 జనవరి ఫస్ట్ నుంచి ఈ ఓటీపీ అందుబాటులోకి రానుంది. మొత్తానికి చూస్తే.. ఎస్‌బీఐ ఓ మంచి కార్యక్రమానికి నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రయోగం అన్ని బ్యాంకులు చేస్తే బాగుంటుందని కస్టమర్స్ చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments