నిర్మాతలకు గుడ్‌న్యూస్... ఆన్ లైన్ సెన్సార్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా ప్రభావంతో తల్లడిల్లుతోన్న సినిమా పరిశ్రమకు ఓ చిన్న ఊరట దొరికింది. అదేంంటే జాతీయ సెన్సార్ బోర్డు సినిమాలకు ఆన్‌లైన్‌లో సెన్సార్ చేస్తామని ప్రకటించడమే. సాధారణంగా సెన్సార్ సర్టిపికేట్ కావాలంటే నెలరోజుల ముందు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. సదరు సినిమా నిర్మాత సెన్సార్ బోర్డు ముందు హాజరైతే సెన్సార్ సర్టిఫికేట్ లభించేంది. కానీ ఇప్పుడు రూట్ మారింది. జాతీయ సెన్సార్ బోర్డ్ కాస్త పెద్ద మనసు చేసుకుంది. నిర్మాతల కష్టాలు తీర్చడానికి సిద్దమైంది. ఇప్పుడు ఓటీటీ కోసం కూడా సెన్సార్ అవసరం అవుతుండటంతో ఆన్‌లైన్‌లోనే సెన్సార్ అప్లయ్ చేసుకోమని బోర్డు తెలియజేసింది.
అంతే కాకుండా మరో బెనిఫిట్ కూడా సెన్సార్ బోర్డ్ నిర్మాతలకు కలిగించింది. నిర్మాత సౌలభ్యం మేరకు ఎక్కడ షో వేస్తే అక్కడకు సెన్సార్ బోర్డు సభ్యులు వచ్చి సినిమా చూస్తారు. మెయిల్ ద్వారా సెన్సార్ సర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. ఇప్పటికే చాలా మేరకు సినిమాలు సిద్ధంగా ఉండి సెన్సార్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలకు ఇది నిజంగా శుభవార్తే. ఈ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇస్తే తాము అన్నీ సిద్ధం చేసుకుని సెన్సార్ చేసుకుని కనీసం ఓటీటీకైనా సినిమాను ఇస్తామని భావిస్తున్న నిర్మాతలు ఇప్పటికే ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments