RC17: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'రంగస్థలం' కాంబో రిపీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెర్రీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. చరణ్ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అప్పటిదాకా చెర్రీ నటన మీద వచ్చిన విమర్శలన్నింటికీ ఈ చిత్రం ద్వారా గట్టి సమాధానం ఇచ్చాడు. దీంతో చెర్రీ-సుక్కు కాంబినేషన్ మళ్లీ ఎప్పడుఊ ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.
తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లు ప్రకటించారు. చరణ్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే, హోలీ పండుగను పురస్కరించుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. చెర్రీ-సుక్కు కాంబోలో కొత్త మూవీ రాబోతుందంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇద్దరు హోలీ సెలబ్రెట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అలాగే రెండు గుర్రాలు ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ '#Raring2Conquer' అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టింది.
ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోతుండగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వబోతున్నారు. ఇలా రంగస్థలం టీమ్ మొత్తం మరోసారి కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం RC17 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్. ఇటు 'పుష్ప' సినిమాతో తగ్గేదేలే అంటూ అందరివాడనిపించుకున్నారు సుకుమార్. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించుకుని బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు సుకుమార్ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ వైజాగ్, హైదరాబాద్‌లో ముగిసింది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తర్వాత RC 17 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో 2025 ముగిసే లోపు మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments