కరోనా నేపథ్యంలో జియో, వొడాఫోన్ కస్టమర్స్‌కు తీపికబురు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో ఇండియా మొత్తం లాక్డౌన్లో ఉండటంతో టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ కాలంలో తమ వినియోగదారులు ఇబ్బంది పడకూడదని సదరు టెలికా కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఇలా గుడ్‌న్యూస్‌లు చెప్పగా.. తాజాగా జియో, వోడాఫోన్-ఐడియా సంస్థలు తీపికబురు చెప్పింది.
జియో యూజర్స్‌కు శుభవార్త
ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్, 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితంగా ఇస్తున్నట్లు దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. అంతేకాదు.. రీచార్జ్ చేయకున్నా లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇన్కమింగ్ సదుపాయం కలిపిస్తున్నట్లు జియో యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో తమ వినియోగదారులు రీచార్జ్ చేసుకోలేకపోతున్నందు వల్లే ఉచిత కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపింది.
ఇక వోడాఫోన్-ఐడియా విషయానికొస్తే..
తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్- ఐడియా తియ్యటి శుభవార్త చెప్పింది. ‘అతి తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న ప్లాన్ల కాల పరిమితిని పొడిగిస్తున్నాం. అదనంగా ఎక్కువ సమయం మాట్లాడుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనతో సుమారు 100 మిలియన్ల వినియోగదారులు వెంటనే ప్రయోజనం పొందనున్నారు. కాగా.. ఇది వరకే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout