కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో స్వరాష్ట్రాలను వదిలి ఇతరదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికెళ్లలేక.. అక్కడ ఉండలేక నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న వలసకూలీలను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో కువైట్‌లో ఉన్న భారతీయులపై కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త తెలిపింది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే..
కువైట్‌లో ఉంటున్న వారిని భారత్‌కు పంపేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఆమోదం కోసం అక్కడి ప్రభుత్వం వేచి చూస్తోంది. కేంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయనుంది. ఇప్పటికే కేంద్రం.. రక్షణ విమానాలను భారీ బందోబస్తుతో సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా కువైట్‌తో పాటు గల్ఫ్‌కు విమానాలు తరలివెళ్లనున్నాయి. ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్లేందుకు లక్షలాది మంది భారతీయులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే కువైట్‌లోని పలు ఎయిర్‌పోర్టుల్లో భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇంకొంత మంది చేరుకుంటున్నారు. మొదట అక్కడే భారతీయులకు పరీక్షలు చేసి ఆ తర్వాత విమానం ఎక్కించి మరోసారి ఇండియాకొచ్చిన తర్వాత పరీక్షలు చేయనున్నారు. రెండోసారి టెస్ట్‌లన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేయించనున్నాయి.
వీరికి కూడా చాన్స్ ఉందా..!?
అయితే కువైట్‌లో ఇళ్లలో పనికోసం వెళ్లిన వారు.. అక్కడ పనులు దొరక్క బయట ఇబ్బంది పడుతున్నవారిని కూడా పంపుతున్నారా..? లేకుంటే అక్కడ ఉద్యోగం వెళ్లిన వారు కూడా ఇండియాకు తరలిస్తున్నారా..? అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై స్పష్టత కోసం అక్కడున్న మరికొంత మంది భారతీయులు వేచి చూస్తున్నారు. ఇవన్నీ అటుంచితే.. అక్కడ ఇళ్లలో పనులకెళ్లిన వారు ఇంటి యజమానులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక పాస్ పోర్టులు వదిలేసి బయటికి వచ్చి సిమెంట్ పని ఇంకా టీ కొట్లు, సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న వారి సంగతేంటి..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అందర్నీ తరలిస్తున్నారా అనేది తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout