కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్...
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సిన్‌పై ఒక మంచి శుభవార్త అందింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ ‘ఫైజర్’ఫేజ్ 3 ఫలితాలను బుధవారం వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. తుది ప్రయోగాత్మక దశలో తమ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు తేలిందని ఫైజర్ వెల్లడించింది. కాగా.. ఫైజర్ వ్యాక్సిన్‌ను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 170 మందికి ఈ వ్యాక్సిన్‌ను అందించినట్టు ఫైజర్ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల అనంతరం 95 శాతం సత్ఫలితాలు కనిపించినట్లుగా ఫైజర్ పేర్కొంది.
కాగా.. ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను భారత్ మాత్రం వినియోగించే అవకాశాలైతే కనిపించడం లేదు. దీనికి కారణం ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచే వాతావరణ పరిస్థితులు భారత్‌లో లేకపోవడమే. ఈ వ్యాక్సిన్‌ను 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలని ఫైజర్ సంస్థ వెల్లడించింది. దీంతో పలు దేశాలు ఈ వ్యాక్సిన్ విషయంలో సందిగ్ధంలో ఉండిపోతున్నాయి.
దీనిపై.. నీతి ఆయోగ్ సభ్యులు, కోవిడ్-19పై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ వీకే పాల్ స్పందించారు. భారత్‌లో ఉన్న జనాభాకు సరిపడా వ్యాక్సిన్ లభించకపోవచ్చన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రత్యామ్నయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం లభించిన తర్వాత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు వీకే పాల్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments