గుడ్ న్యూసే.. కానీ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని రోజుల క్రితం తాను కోవిడ్ బారీన పడ్డట్లు ఎన్టీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐసొలేషన్ లో ఉంటున్న తారక్ డాక్టర్ల సలహాలు పాటిస్తూ చికిత్స చేయించుకుంటున్నాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు.
తాజాగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఎన్టీఆర్ నెగటివ్ వచ్చినట్లు తెలిపాడు. కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన డాక్టర్లకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వారు తీసుకున్న కేర్ తాను త్వరగా కోలుకునేందుకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపాడు.
ఇదీ చదవండి: 'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్
కోవిడ్ వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 'కరోనా అంత తేలిగ్గా తీసుకునే రోగం కాదు. తప్పకుండా దానిపట్ల సీరియస్ గానే ఉండాలి. సరైన జాగ్రత్తలు, పాజిటివ్ మైండ్ తో దానిని జయించవచ్చు. కరోనాపై పోరాటంలో మీ విల్ పవర్ అతిపెద్ద ఆయుధం' అంటూ తారక్ అభిమానులకు సందేశం ఇచ్చాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే మరో భారీ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో పాన్ ఇండియా చిత్రానికి ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
Happy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes ????
— Jr NTR (@tarak9999) May 25, 2021
I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout