పండుగలాంటి శుభవార్త చెప్పిన ఆర్బీఐ..
Send us your feedback to audioarticles@vaarta.com
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆన్లైన్ లావాదేవీలపై పండుగలాంటి శుభవార్త అందించింది. ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లపై ఛార్జీల భారం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ నెఫ్ట్‌కు.. ఆర్జీటీఎస్ సెపరేట్‌గా చార్జ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
త్వరలో శుభవార్తలే.. శుభవార్తలు!
గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి దిగొచ్చింది. కాగా.. ఆర్బీఐ ఇలా వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్థిక నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ ఎంసీపీ సమావేశాల్లోనూ ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారన్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. రేట్ల కోతతో ఇంటి రుణాలు, ఆటో లోన్స్, గోల్డ్ లోన్స్ రుణ రేట్లు దిగొచ్చే అవకాశముందని.. అలాగే డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments