ప్రభాస్‌కు ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
రాయ్‌దుర్గ్ పన్మక్త్ గ్రామంలో హీరో ప్రభాస్ కోనుగోలు చేసిన భూమి ప్రభుత్వ భూమి అంటూ.. అధికారులు దానికి తాళాలు వేశారు. ప్రభాస్ దానిపై హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించి తీర్పునిచ్చారు. కోర్టు ప్రకారం.. 60 ఏళ్లుగా కొనసాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది. ప్రభాస్ స్వాధీనంలో ఉన్న భూమిని ఖాళీ చేయించలేమని.. చట్ట విరుద్ధమని చెప్పింది. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధివిధాలను అనుసరించలేమని చెప్పింది.
అలాగే 1958 నుండి ఇక్కడి భూములపై వివాదం జరుగుతుంది. కాబట్టి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని కూడా ఆదేశించలేమని పేర్కొంది. భూ క్రమబద్దీకరణకు ప్రభాస్ దరఖాస్తు పెట్టుకుంటే ప్రజా ప్రయోజనాలు.. ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. ప్రభాస్ దరఖాస్తుల విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపింది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్ సేల్ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాని వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది. దీంతో హీరో ప్రభాస్‌కు ఊరట దొరికినట్టయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments