Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'దేవర' అప్టేడ్ వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్టేడ్ వచ్చింది. మూవీ గ్లింప్స్ ఎప్పుడు విడుదల చేయనున్నారో చెబుతూ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో తారక్.. బ్లాక్ డ్రెస్‌లో టక్ చేసుకుని పడవలో నిలబడి సీరియస్ లుక్‌లో ఉన్నారు. జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RRR వంటి బ్లాక్బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గతంలో ఎప్పుడు లేనంత భయంకరంగా ఉంటారని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో విపరీతమైన వయెలెన్స్ ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం విశేషం. కాగా ఎన్టీఆర్- కొరటాల కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నటుడిగా తారక్ మరో మెట్టు ఎక్కారు. వీరి కాంబోలో ఇప్పుడు 'దేవర' రానుండడంతో మూవీ సర్కిల్లో హై భజ్ ఏర్పడింది. మొదటి పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com