Janhvi Kapoor:మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్..
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే తన తల్లి సొంత ప్రాంతమైన దక్షిణాదిలో మాత్రం ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. సౌత్ సినిమాల్లో నటించి శ్రీదేవి లాగా గుర్తింపు తెచ్చుకోవాలని జాన్వీ కూడా ట్రై చేస్తోంది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నాలు ఫలించాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా 'దేవర' సినిమా ద్వారా ఆమె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. తాజాగా మరో తెలుగు చిత్రంలో ఆమె నటించనున్నారు.
అది కూడా మెగా పవర్‌స్టార్ సరసన కావడం విశేషం. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ నటించబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ వార్తను నిజం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తమ మూవీ యూనిట్‌లోకి వెల్కమ్ అంటూ పోస్టర్‌లో తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరు, శ్రీదేవి వారసులు కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గతంలో చిరంజీవి, శ్రీదేవి జంట అప్పటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా సీక్వెల్ రానుందని.. ఇందులో చెర్రీ, జాన్వీ కపూర్ నటిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. మొత్తానికి RC16 సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తుండటంతో మంచి భజ్ ఏర్పడింది. మరి ఈ జంట కూడా చిరు, శ్రీదేవి జంటను గుర్తుకు తెచ్చి ప్రేక్షకులు ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తుంటే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీలో చరణ్ నటిస్తున్నారు. ఈ ఏడాదిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments