Srilanka: శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక ఆ అవసరం లేదు..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండానే తమ దేశం రావొచ్చని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయిచింది. భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలకు ఈ అవకాశం కల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టాలని శ్రీలంక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు.
శ్రీలంక అంటేనే పర్యాటక రంగానికి పెట్టింది పేరు. ఆ దేశానికి వచ్చే ఆదాయంలో అధిక శాతం విదేశీ పర్యాటకుల ద్వారానే వస్తుంది. అయితే కరోనా కారణంగా పర్యాటక రంగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీనికి తోడు ఆ దేశంలో నెలకొన్ని రాజకీయ అస్థిరతతో శ్రీలంక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత రాజకీయంగా కొంత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే తగ్గిపోయిన విదేశీ పర్యాటకులను తిరిగి ఆ దేశానికి రప్పించేందుకు శ్రీలంక ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. తొలుత 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించగా.. ఇప్పుడు దాన్ని ఏడుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments