రైతన్నలు, డ్వాక్రా మహిళలకు జగన్ శుభవార్త
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. ఇప్పటికే కేవలం వందరోజుల పాలనలోనే తనదైన మార్క్ వేసుకున్న జగన్.. ఎన్నో కీలక, సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా పాదయాత్రలో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని జగన్ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆ హామీని నెరవేర్చే దిశగా వైఎస్ జగన్.. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకు అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వడ్డీలేని రుణాలు ఇస్తాం!
వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బు నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని జగన్ అన్నారు. గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ కింద చెల్లింపులను రశీదు రూపంలో వారికి అందిస్తారని వివరించారు. సున్నావడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించారో ప్రభుత్వానికి జాబితా ఇస్తే వాటిని ప్రభుత్వం నిర్ణిత సమయంలోనే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.
చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సాహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతినెలా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుందని, ఇందుకు బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని జగన్ అన్నారు. చిరువ్యాపారులు ప్రోత్సాహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని.. ప్రభుత్వం పథకాల అమలుకు బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమన్నారు. సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరిస్తామని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments