ఇక నుంచి మే వరకూ సినీ ప్రియులకు ప్రతి నెలా పండుగే..
Send us your feedback to audioarticles@vaarta.com
తొమ్మిది నెలల పాటు థియేటర్లో సినిమాలకు దూరమైన సినీ ప్రియులకు ఇక నుంచి ప్రతి నెలా పండుగే కానుంది. ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జనవరి ప్రథమార్ధంలో విడుదలైన క్రాక్, రెడ్, మాస్టర్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే జనవరి 23న అల్లరి నరేశ్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం విడుదలైంది. అలాగే మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. అలాగే ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'చెప్పినా ఎవరూ నమ్మరు' సినిమా కూడా ఈ నెల 29నే విడుదల కానుంది.
ఫిబ్రవరిలో విడుదలయ్యే సినిమాలు..
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మూడో చిత్రం 'జాంబిరెడ్డి'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫిబ్రవరి 12న ఏకంగా మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘ఎ 1 ఎక్స్ప్రెస్’, ఫక్ సినిమాలు కూడా ఫిబ్రవరి 12నే విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో తెరకెక్కిన 'చెక్' అనే సినిమా ఫిబ్రవర్ 19న విడుదల కానుంది. అలాగే రేడియో మాధవ్, ‘5 డబ్ల్యూస్’ సినిమా కూడా విడుదల కానుంది.
మార్చిలో విడుదలయ్యే సినిమాలు..
మార్చిలో కూడా ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో మార్చి 11న శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు సినిమాలు, మార్చి 26న రెండు సినిమాలు, మార్చి 30న ఒక సినిమా విడుదల కానుంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అలాగే శర్వానంద్, ప్రియాంక మోహన్ జంటగా రూపొందిన సినిమా ‘శ్రీకారం’ సైతం మార్చి 11నే విడుదల కానుంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘రంగ్ దే’ సినిమా మార్చి 26న విడుదల కానుంది. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్య’. ఈ సినిమా కూడా మార్చి 26న విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా మార్చి 30న విడుదల కానుంది.
ఏప్రిల్లో విడుదలయ్యే సినిమాలు..
ఏప్రిల్ నెల సినీ ప్రియులకు అసలైన పండుగ. ఈ నెలలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే నేచురల్ స్టార్ నాని నటించి ‘టక్ జగదీష్’ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెన్స్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీక్వెన్స్ అంటే ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా కూడా ఏప్రిల్లోనే విడుదల కానుంది.
మేలో విడుదలయ్యే సినిమాలు..
మే నెల స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకైతే మూడు సినిమాలు విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నందమూరి నట సింహం బాలకృష్ణ, పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బీబీ 3’ మూవీ మే నెల 7వ తారీఖున విడుదల కానుంది. అలాగే మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ సినిమా సైతం ఈ నెలలోనే విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. చిరంజీవి, కాజల్ జంటగా స్టార్ డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా మే నెల 7న కానీ 16న కానీ విడుదల కానుంది. అలాగే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న.. ‘రాధేశ్యామ్’ చిత్రం మే లేదా జులైలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com