బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ హీరోగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విజయవంతంగా ఇప్పటికీ రన్ అవుతుండగా.. మరోవైపు కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురుస్తోంది. ఇప్పటికే నాన్ బాహుబలి.. అదీ ఇదీ అంటూ రికార్డ్‌లను మాత్రం తిరగరాసేసింది. సినిమా ఊహించిన దానికంటే సక్సెస్ అవ్వడం.. అది కూడా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా ఈ రేంజ్‌లో హిట్టవ్వడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఇందుకు సంబంధించి థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్ ఇలా అన్ని అయిపోయాయ్.
సీక్వెలా..!?
అయితే ఇదే ఊపులో మరో సినిమా చేసేయాలని సుకుమార్‌తో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా షురూ అయ్యింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. ‘అల వైకుంఠపురములో..’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీతో మరో సినిమా కచ్చితంగా ఉంటుందని.. అది సీక్వెల్ అయినా కావొచ్చు లేదా వేరే కథతో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే బన్నీ-తివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే.
మాటిచ్చిన మాటల మాంత్రికుడు!
దీంతో ఇదే ఊపులో మరోసినిమా తీయాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్.. త్రివిక్రమ్‌కు సూచించగా ఆయన మాటిచ్చారట. అయితే సీక్వెల్ ఉంటుందా..? లేదా మరో డిఫరెంట్ స్టోరీనా అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం దీని తాలుకు పుకార్లు ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ ఒకరిద్దరు స్టార్ హీరోలతో కూడా సినిమా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి బన్నీతో సినిమా అంటే ఉండొచ్చు కానీ ఇప్పట్లో కాదని మాత్రం తెలుస్తోంది. కాగా ఇటీవలే బన్నీ ఇంట్లో గ్రాండ్ పార్టీ జరగ్గా త్రివిక్రమ్-అల్లు అరవింద్ మధ్య సినిమా గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీక్వెల్ ఉంటే మాత్రం బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండ్ అన్నమాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com