వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్లపై రాయితీ
Send us your feedback to audioarticles@vaarta.com
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల(Pending Challans)పై మరోసారి రాయితీని ఇచ్చేందుకు పోలీసుశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం, టూవీలర్ చలాన్లకు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఇక లారీలతో పాటు ఇతర భారీ వాహనాలకు 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 10వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌తో పాటు మీసేవ సెంటర్స్‌లో రాయితీ చలాన్ల పేమెంట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
గతేడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు. మళ్లీ పెండింగ్ చలాన్లు భారీగా పెరిగిపోవడంతో గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ రాయితీ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు వచ్చారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడవం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఓవర్ టేకింగ్, రాంగ్ రూట్, డ్రంకెన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకపోవడం వంటి తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఆయా వాహనదారులకు పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో చలాన్లపై రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com