కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' జూన్ 3న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తుండగా, జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విమన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సహ నిర్మాత శ్రావ్య వర్మ ఆధ్వర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియన్లు పనిచేస్తుండటం గమనార్హం. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతోంది. పాపులర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తోన్న 'గుడ్ లక్ సఖి'ని వర్త ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నట్లు ఒక రిలీజ్ డేట్ పోస్టర్ ద్వారా సోమవారం చిత్ర బృందం ప్రకటించింది. ఆ పోస్టర్లో కీర్తి సురేష్ ఓ గన్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తుండగా, ఆమెకు చెరోవైపు జగపతిబాబు, ఆది పినిశెట్టి నిల్చొని ఉన్నారు. స్పోర్ట్స్ రొమ్-కామ్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక షూటర్‌గా కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని వర్గాల నుంచీ ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.
తారాగణం: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments