నిజ జీవితంలోనూ తనో మంచి ఫ్రెండ్: నివేదా

  • IndiaGlitz, [Sunday,August 30 2020]

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’. ఇప్పటి వరకు థియేటర్స్ కోసమే ఎదురు చూసిన ఈ చిత్రం.. పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం విడుదలకు సిద్ధమైనందున నివేదా మీడియాకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా నానితో అనుబంధం గురించి నివేదా మాట్లాడుతూ.. ‘‘నానితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ త‌న‌కు నాకు మంచి ఫ్రెండ్‌. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే త‌న సినిమాల్లోని పాత్ర‌లు గురించి నాతో డిస్క‌స్ చేస్తుంటాడు. నాని యాక్ట‌ర్‌గా ఓ పాత్రను ఒప్పుకున్నాడంటే దాన్ని తెరపై తీసుకురావడానికి ఇంకా గొప్ప ప్రయత్నం చేస్తారు. త‌ను చాలా విషయాల్లో నాకు ఇన్‌స్పిరేషన్. ఇక సినిమా బ‌డ్జెట్‌లు, ఫైనాన్స్ విష‌యాలు నాకు తెలియ‌వు’’ అని వెల్లడించింది.

‘వి’ సినిమా లాక్‌డౌన్‌కు పూర్వమే పూర్తయిందని నివేదా వెల్లడించింది. సినిమా నిర్మాతలకు తాను సపోర్టివ్‌గానే ఉంటానని నివేదా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే కొనసాగవని.. త్వరగానే సెట్ అవుతాయని నివేదా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరితోనూ తనకు మంచి అనుబంధం ఉందని నివేదా తెలిపింది. ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు జీవించేశారని నివేదా చెప్పుకొచ్చింది.