ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి రోజులొచ్చాయ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తప్పిదాల్ని దిద్దుకుని మళ్లీ గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై విజయాలు వెక్కిరిస్తుంటే ఇన్ని రోజులు భరించిన ఢిల్లీ ఇక దూకుడు పెంచింది. మేం రంగంలోకి దిగనంతే వరకే.. వన్స్ మేం దిగామంటే విజయాలన్నీ మా సొంతమే అంటూ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ క్యాపిటల్స్ ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన బౌలింగ్ వేసి స్వల్ప స్కోరుకే పంజాబ్‌ను పరిమితం చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ శిఖర్ థావన్, శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయారు. ఒకానొక దశలో తడబడ్డా బౌండరీతో క్యాపిటల్స్‌ను గెలిపించారు. ధవన్ 41 బంతుల్లో 56 పరుగులు చేయగా ఇందులో 7ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 49 బంతుల్లో 58 పరుగులు చేయగా ఇందులో 5 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. శ్రేయాస్ నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖరికి పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 పాయింట్లతో ఢిల్లీ జట్టు ముంబైతో సమానంగా ఉన్నా నెట్ రన్‌రేట్‌లో తేడాతో మూడో స్థానంలోనే ఉంది.
కాగా.. ఇప్పటి వరకూ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాలుగింట అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇదే పరిస్థితి కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని సమష్ఠి ఆటతీరుతో ఢిల్లీ క్యాపిటల్స్ పంజా విసిరింది. అయితే ముందుగా క్రిస్ గేల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ‘పంజా’ విసిరేందుకు సిద్ధమైన ప్రత్యర్థిని యువ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానె అద్భుత బంతులతో కట్టడి చేశాడు. అనంతరం ఓపెనర్ శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ చక్కటి భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు, క్రీడాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments