హర్షవర్ధన్ ' గుడ్ బ్యాడ్ అగ్లీ ' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Sunday,August 13 2017]

న‌టుడిగా, మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారారు. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అంజిరెడ్డి నిర్మాత‌. ముర‌ళి, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా న‌టించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కత్వంతో పాటు ఈ సినిమాకు సంగీతం అందించ‌డం కూడా విశేషం. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మంలో...
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫీల్ గుడ్ మూవీ
హర్ష‌వర్ధ‌న్ మాట్లాడుతూ - ''నేను న‌టుడిగా, మాట‌ల ర‌చ‌యిత‌గా అంద‌రికీ పరిచ‌య‌మే. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌నం సినిమాల‌కు నా సంభాష‌ణ‌ల‌కు మంచి పేరు వ‌చ్చింది. మీడియావారు న‌న్నెక్క‌డో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇక నేను ద‌ర్శ‌కుడిగా నా జ‌ర్నీని స్టార్ట్ చేశాను. సాధార‌ణంగా పెళ్లిని ఘ‌నంగా చేయడం చూస్తుంటాం. ష‌ష్టి పూర్తి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డ‌మే లేదు. ఆశించ‌డం కూడా త‌ప్పే అవుతుంది. కానీ పెళ్లి సైలెంట్‌గా జ‌ర‌గాలి. ష‌ష్టిపూర్తి ఘ‌నంగా జ‌ర‌గాల‌నే ఆలోచ‌న నుండి ఈ సినిమా క‌థ పుట్టింది. కాన్సెప్ట్ మూవీస్‌ను మొద‌లు పెట్ట‌డం కంటే పూర్తి చేయ‌డం చాలా క‌ష్టం. కాబ‌ట్టి నేను సైలెంట్‌గా సినిమాను పూర్తి చేసుకుంటూ వ‌చ్చాను. మొద‌టిసారి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం వ‌ల్ల సినిమా గురించి, నా గురించి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఇంత బాగా పూర్తికావ‌డానికి నేను చెప్పిన బ‌డ్జెట్‌ను న‌మ్మి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేసిన విశ్వేష్‌గారికి థాంక్స్‌.
ఈ సినిమాకు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టాన‌ని చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న ప‌ల్లెటూర్ల‌లో కూడా ఈ ప‌దాల‌న విరివిగా వాడుతున్నారు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అలాగే మంచి, చెడు, తింగ‌రిత‌నం అనేవి సంద‌ర్భాన్ని బ‌ట్టి మ‌న నుండి బ‌య‌ట‌ప‌డ‌తాయి. అందుకే ఈ టైటిల్ ఖ‌రారు చేశాం. రైట‌ర్ నుండి దర్శ‌కుడిగా మారిన నేను పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్నాను. సినిమాలో ఏకైక లేడీ క్యారెక్ట‌ర్‌ను శ్రీముఖి చేసింది. అడగ్గానే ఒప్పుకుని చేసింది. అలాగే కిషోర్ గారు ఎంతో గొప్ప‌గా న‌టించారు. సినిమాలో హీరో పాత్ర‌లో న‌టించిన ముర‌ళి కొత్త డైమ‌న్ష‌న్ ఉన్న పాత్ర చేశాడు. సినిమా 1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌కథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. పెద్ద హీరోల స్థాయికి త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంది. సినిమా ద‌ర్శ‌క‌త్వంతో పాటు సంగీతం కూడా అందిచ‌డానికి కార‌ణం నేను సంగీత ద‌ర్శ‌కుడ‌వుదామ‌నే హైద‌రాబాద్ చేరుకున్నాను. మ్యూజిక్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించ‌లేను కానీ మ్యూజిక్‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. క‌మ‌ల్ స‌హకారంతో సంగీతం అందించాను. అలాగే అంజిరెడ్డిగారికి థాంక్స్‌''అన్నారు.
న‌మ్మ‌కంతో చేశాం.
విశ్వేష్ మాట్లాడుతూ - ''హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌గారికి స్టోరీపై ఉన్న కాన్ఫిడెంట్ చూసి ఓ న‌మ్మ‌కంతో ఈ సినిమాను నిర్మించ‌డానికి నిర్ణ‌యించుకున్నాం. సినిమా బాగా వ‌చ్చింది'' అన్నారు.
హ‌ర్ష‌వర్ధ‌న్‌గారే కార‌ణం
శ్రీముఖి మాట్లాడుతూ - ''జెంటిల్‌మేన్ సినిమా త‌ర్వాత నాకు స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ అవ‌కాశాలు చాలానే వ‌చ్చాయి. అయితే నేను ఏదో త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాలు చేసేసి స్థిర‌ప‌డిపోవాల‌ని అనుకోవ‌డం లేదు. నేను ఇప్పుడున్న పోజిష‌న్‌లో హ్యాపీగా ఉండ‌టం వ‌ల్ల న‌చ్చిన క‌థ‌ల‌నే ఒప్పుకుంటున్నాను. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది'' అన్నారు.
కిషోర్ మాట్లాడ‌తూ - '' మ‌న‌కంటే మన చేసే ప‌ని మాట్లాడాలి అనుకునే వ్య‌క్తిని నేను. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌గారు కూడా అంతే. ఈ సినిమాయే ఆయ‌నెంటో చెబుతుంది'' అన్నారు.
ముర‌ళి మాట్లాడుతూ - ''హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేశాను. మంచి పాత్ర‌. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది'' అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సంతోష్‌, సురేష్‌, శ్రీధ‌ర్‌, క‌మ‌ల్, టిఎన్ఆర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, అజ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; మ‌హేష్ క‌త్తి, సంతోష్‌, చెర్రి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, ర‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌, మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః క‌మ‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, ర‌చ‌న‌, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.

More News

రాజమౌళికి 'లై' నచ్చలేదా?

దర్శకమౌళి రాజమౌళి అందరివాడు.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు,తన నుంచి ఇవ్వవలసిన సపోర్ట్ ని ఇస్తూ...

జోష్ బాటలో యుద్ధం శరణం..

రారండోయ్ వేడుక చూద్దాంతో ఈ ఏడాది ప్రథమార్థంలో తన ఖాతాలో మరో హిట్నిజమ చేసుకున్నాడు నాగ చైతన్య.

'ప్రాజెక్ట్ z' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ ప్రథమార్థంలో విడుదల

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్'

నిత్యా మీనన్..ఎన్నాళ్లెన్నాళ్లకు..

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించడానికి ఇష్టపడే కథానాయిక నిత్యా మీనన్

శోభన్ తో తల్వార్...

రాజా చెయ్యి వేస్తేచిత్రంలో నటించిన ఇషా తల్వార్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు.