కరోనా కష్టకాలంలో శుభవార్త చెప్పిన వాట్సాప్

అవును మీరు వింటున్నది నిజమే.. అసలు కరోనాకు.. వాట్సాప్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా..? ఎలాంటి సంబంధం లేదు కానీ.. ఈ టైమ్‌లో ఏం జరిగినా.. ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా.. అన్నీ కరోనా కాలంలోనే అంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పలు రంగాలు కూడా ప్రజలను ఉద్ధేశించి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయితే లాక్‌డౌన్‌తో ప్రజలు ఎక్కువ మందితో మాట్లాడుకునేందుకు వీలు కల్పించింది వాట్సాప్. ఇప్పటి వరకూ సాధారణ లేదా వీడియో కాల్ మాట్లాడేందుకు నలుగురికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే తాజాగా మరో నలుగుర్ని పెంచి.. మొత్తం ఒకేసారి 8 మంది మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించింది.

లాక్‌డౌన్ కారణంగా ఆడియో, వీడియో, గ్రూప్ కాలింగ్‌కు ఎక్కువ ఆదరణ పెరిగిన విషయం విదితమే. ఇందులో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. కాగా.. పెరిగిన పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోందని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే శుభవార్త చెప్పినట్లే చెప్పి యాజమాన్యం.. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకుగాను కస్టమర్లు బీటా వెర్షన్‌ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ స్పష్టం చేసింది. సో ఏదైతేనేం వాట్సాప్ శుభావార్తే చెప్పిందన్న మాట.

More News

హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో

కలకలం.. ప్రముఖ టీవీ ఛానెల్‌లో 26 మందికి కరోనా

కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మీడియా మిత్రులను కూడా కరోనా కాటేస్తోంది. ఇప్పటికే ముంబైలోని 56 మంది జర్నలిస్టులకు కరోనా

ఏపీలో 757కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇవాళ ఇద్దరు మృతి చెందారు.

ప్రమాణానికి సిద్ధమైన విజయసాయి.. కన్నా వాట్ నెక్స్ట్!?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్ల రూపాయిలకు అమ్ముడుపోయాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిస్థితి విషమం.. రంగంలోకి అమెరికా!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తున్న వేళ ఈ వార్త బయటికి రావడంతో పెను సంచలనమైంది.