ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ వరాలజల్లు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. బుధవారం నాడు ఉద్యోగలుపై కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు కూడా జారీచేయడం జరిగింది. కాగా.. ఈ ఉత్తర్వులు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తమ డిమాండ్స్ నెరవేర్చాలని ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజులపాటు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన కేసీఆర్.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేశారు. కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని.. అలాగే మహిళ ఉద్యోగులు కోరిన విధంగా ప్రసూతి సెలవులు మంజూరు చేసిన విషయం విదితమే.

More News

ఏపీ రాజధానిపై సరికొత్త వాదన.. గ్రేటర్ రాయలసీమ!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో అటు రాయలసీమలో..

'ప్రతిరోజు పండగే' చిత్రానికి అల్లు అర్జున్ అభినందనలు

'చిత్రలహరి' సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో

బాలయ్య స్టైల్ మార్చనున్న బోయపాటి ?

ఏ సినీ పరిశ్రమలోనైనా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో హీరో బాలకృష్ణ,

ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన పెద్దమ్మ శ్యామ‌ల!

సినీ ఇండస్ట్రీ మొత్తమ్మీద బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ఎక్కువగా వినపడుతుంటుందన్న విషయం తెలిసిందే.

ద‌ర్శ‌కుడు వెంక‌ట్ మ‌హ కొత్త చిత్రం 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌'

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌,